యూరియా సహా ఎరువులన్నీ అందిస్తాం..ఫెర్టిలైజర్ యాప్‌‌తో రైతులకు మెరుగైన సేవలు: మంత్రి తుమ్మల 

యూరియా సహా ఎరువులన్నీ అందిస్తాం..ఫెర్టిలైజర్ యాప్‌‌తో రైతులకు మెరుగైన సేవలు: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: రైతులకు యూరియా సహా అన్ని రకాల ఎరువులు సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యూరియా పంపిణీని సులభతరం చేయడానికే ఫెర్టిలైజర్ యాప్‌‌ను తీసుకొచ్చామని చెప్పారు. రైతుల సూచనల మేరకు యాప్‌‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపారు. పారదర్శకత, వేగవంతమైన సేవలే యాప్ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు..

కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు తిరుమల గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు వడ్డే ఉమేష్, మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు శ్రీనివాస్, తిప్పని కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు మరియదాస్ తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో యూరియా కోసం ఇబ్బందులు పడేవాళ్లమని, ఇప్పుడు యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకుని ఎరువులు పొందుతున్నామని చెప్పారు. దీంతో ఎరువుల పంపిణీ వ్యవస్థ మరింత మెరుగుపడిందన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు మరింత చేరువయ్యేలా యాస్​లో కొన్ని సాంకేతిక మార్పులు చేయాలని సూచించారు